రేపు కొల్లూరులో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

ప్రకాశం: కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయిస్ రిక్రియేషన్ క్లబ్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొననున్నారు. కొల్లూరు మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలు, అర్జీలు నేరుగా ఎమ్మెల్యేకి వివరించి పరిష్కరించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన క్యాంప్ కార్యాలయం గురువారం సూచించింది.