కొత్తపేటలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణమహల్ వద్ద బుధవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని గుర్తింపు కోసం ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే కొత్తపేట PSలో సంప్రదించాలన్నారు.