వేటకు వెళ్లి వ్యక్తి మృతి

వేటకు వెళ్లి వ్యక్తి మృతి

బాపట్ల మండలం పిన్నిబోయిన వారి పాలెం వద్దగల నాగరాజు కాలవలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చీరాల మండలం ఓడరేవుకు చెందిన పెద్ద సోమయ్య అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి పడవలో నుంచి జారిపడి నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. అధికారులు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.