మారిన టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ

మారిన టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగింది. అపోలో టైర్స్ భారత జెర్సీకి స్పాన్సర్‌గా వచ్చింది. దీంతో గతంలో వాడుతున్న ప్రాక్టీస్ జెర్సీ రంగును కూడా మార్చింది. ఇకపై భారత ప్లేయర్లు ప్రాక్టీస్‌లో ఇదే జెర్సీని వాడనున్నారు.