'విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి'

KKD: ప్రభుత్వం విద్యారంగంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కాకినాడ జిల్లా SFI అధ్యక్షులు జి. శ్రీకాంత్ కోరారు. ఇవాళ విద్యారంగంలోని సమస్యలపై ప్రతిపాడు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం అందించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.