VIDEO: పాలకొల్లులో శ్రమదానం చేసిన మంత్రి

VIDEO: పాలకొల్లులో శ్రమదానం చేసిన మంత్రి

W.G: పాలకొల్లులోని గౌడ శెట్టిబలిజ కళ్యాణమండపం స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం కార్మికులతో కలిసి శ్రమదానం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.1.50 కోట్లతో మొదటి స్లాబ్ పనులు జరిగినా, వైసీపీ హయాంలో ఆగిపోయాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు.