'కొండపల్లి బొమ్మలను ప్రపంచానికి పరిచయం చేయాలి'
NTR: విజయవాడలో జరిగిన కొండపల్లి బొమ్మల పండుగ కార్యక్రమంలో సమాచార & పౌరసరఫరాల శాఖ మేనేజర్ విశ్వనాధ్‌తో కలిసి కలెక్టర్ లక్ష్మీశ నిన్న పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మలు మన గొప్ప వారసత్వానికి ప్రతీక అని అన్నారు. కొండపల్లి బొమ్మలను ప్రపంచానికి పరిచయం చేయాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. కొండపల్లి కలకు కొత్త ఊపిరి లభించిందన్నారు.