రామాలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం నియోజకవర్గం తామర గ్రామంలో వెలిసిన శ్రీ కోదండ రామాలయం 10వ వార్షికోత్సవాన్ని కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.