' ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

ఆదిలాబాద్: వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కుంటాల ఎస్సై రజనీకాంత్ పేర్కొన్నారు. కుంటాల మండలంలోని అర్లి(కే)జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు సరైన వాహన పత్రాలు కలిగి ఉండాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.