కర్నూలు ఉల్లి రైతులను ఆదుకుంటాం: మంత్రి
KRNL: కనీస ధరలు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామన్నారు.