వైసీపీ కులాల మధ్య చిచ్చు పెడుతుంది: మంత్రి

AP: కొందరు రాజకీయ అవసరాల కోసం కులాల మధ్య అలజడి సృష్టిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు అదే పని చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.