గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన వైసీపీ ఇంఛార్జ్
ప్రకాశం: కనిగిరి మండలం నేలటూరి గొల్లపల్లిలో వెలసిన కాటకోటేశ్వర గంగమ్మ తల్లి ఆలయాన్ని వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ వైసీపీ శ్రేణులతో కలిసి ఆదివారం సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు వైసీపీ శ్రేణులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలు సంతోషంగా ఉండేలా అమ్మవారు దీవించాలని కోరుకున్నారు.