VIDEO: సీజనల్ వ్యాధులపై అవగాహన

NZB: ఏర్గట్ల మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రక్షిత మంగళవారం సందర్శించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. వంటగదిని, మరుగుదొడ్లను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. PHN ఇందిరా, హెల్త్ అసిస్టెంట్ పండరి, మోహన్, కల్పన, తదితరులు పాల్గొన్నారు.