VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న రోటి గూడ వాగు

MNCL: జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం ఉదయం జన్నారం మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరదనీరు రావడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ మార్గంలో ఉన్న రోటి గూడ, గీతానగర్ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.