పలు విమాన సర్వీసుల రద్దు

పలు విమాన సర్వీసుల రద్దు

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించాల్సిన పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన 8 విమానాలు రద్దు చేశారు. అలాగే, శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 10 విమానాలను రద్దు చేశారు.