ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి
SRPT: ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం అడ్లూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ యువకుడు వెనక నుంచి ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.