జాతీయ రహదారిపై ఉప్పుటూరు టోల్ ప్లాజా
BPT: పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పిడుగురాళ్ల-ఓడరేవు నూతన జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా, పర్చూరు-కారంచేడు మధ్య ఏర్పాటు చేస్తున్న టోల్‌గేట్‌కు 'ఉప్పుటూరు టోల్ ప్లాజా' అని పేరు పెట్టారు. దీనిపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి జాతీయ గుర్తింపు లభించిందని ప్రజలు భావిస్తున్నారు.