'రైతులు ఒకే మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలి'
ASF: రైతు భరోసా, ఫార్మర్స్ రిజిస్ట్రీ, ఎరువుల బుకింగ్ యాప్ వంటి విభాగాల్లో రైతులందరూ ఒకే మొబైల్ నంబర్ ఉండేలా చూసుకోవాలని దహేగాం MAO రామకృష్ణ సూచించారు. వేర్వేరు నంబర్లు ఉంటే భవిష్యత్తులో ఎరువుల బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు, ఎరువుల కొనుగోలు ప్రక్రియ సులభతరం కావాలంటే ఈ వివరాల అనుసంధానం తప్పనిసరి అని స్పష్టం చేశారు.