శ్రీశైలం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తివేత

AP: శ్రీశైలం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గేట్ల నుంచి 2.39 లక్షల క్యూసుక్కుల నీరు విడుదలవుతోంది. జురాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి 2.53 లక్షల క్యూసెక్కులు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.7 అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది.