సిద్దవటంలో రేపు సీతారాముల కళ్యాణోత్సవం

KDP: సిద్దవటం మండలంలోని 11వ పోలీస్ బెటాలియన్ సమీపంలో ఉన్న రాములింగేశ్వర ఆలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు సీతారాముల మూల విరాట్ విగ్రహాలకు కళ్యాణం నిర్వహించబడునని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 21వ వార్షికోత్సవ సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు, రాత్రికి గ్రామోత్సవం ఉంటుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.