లారీ ఢీకొని మహిళ మృతి
ఏలూరు రూరల్ మండలం మహేశ్వర పురం గ్రామానికి చెందిన ఎం. ఝాన్సీ (25) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పాట్‌లో మృతి చెందారు. భర్త నాగేంద్ర, ముగ్గురు పిల్లలతో కలిసి బైక్ పై ఏలూరు వెళ్తుండగా, సుంకర వారి తోట వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, పిల్లలు గాయాలపాలయ్యారు. రూరల్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేశారు.