బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హిందూపురం ఎంపీ

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హిందూపురం ఎంపీ

సత్యసాయి: సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో శ్రీ సజ్జగంట రంగనాథస్వామి 101వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.