నీరవ్ మోదీకి షాకిచ్చిన యూకే కోర్టు

నీరవ్ మోదీకి షాకిచ్చిన యూకే కోర్టు

పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.వేల కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీకి యూకే కోర్టు షాక్ ఇచ్చింది. తనను భారత్‌కు అప్పగించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ వేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టే పరిస్థితులు కనిపించడం లేదని తెలిపింది. దీంతో అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది.