'వార్డుల్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తా'
SRCL: వేములవాడ పట్టణంలోని వార్డులలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా దశలవారీగా పరిష్కరిస్తామని మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు అన్నారు. 25 వార్డులో గత కొన్ని సంవత్సరాల క్రితం మూతపడిన వాటర్ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఏళ్ల తరబడి ప్లాంట్ మూతపడటంతో వార్డు ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు.