భీంపూర్‌లో పెద్దపులి సంచారంతో స్థానికుల ఆందోళన
ADB: భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల మండలంలోని తాంసి(కే) గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకునే సమయంలో పెద్దపులి సంచరించిందని రైతులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు FSO అహ్మద్ ఖాన్ ఇవాళ పేర్కొన్నారు. అలాగే, వ్యవసాయ పనులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.