చెన్నై సూపర్ కింగ్స్‌లోకి విధ్వంసక వీరుడు

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి విధ్వంసక వీరుడు చేరాడు. గుజరాత్‌కు చెందిన వికెట్ కీపర్, బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంది. వంశ్ బేడీ స్థానంలో అతడిని జట్టులో చేర్చుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. కాగా, గాయం కారణంగా ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు వంశ్ బేడీ దూరమైన విషయం తెలిసిందే.