19 మద్యం దుకాణాలకు 491 దరఖాస్తులు
TG: రాష్ట్రంలో 19 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం 491 దరఖాస్తులు వచ్చాయి. వీటికి ఈ నెల 3న లాటరీ తీయనున్నారు. 2025-27 మద్యం విధానంలో భాగంగా రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం అక్టోబరు 23 వరకూ దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే 19 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావటంతో.. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి శనివారం వరకు మళ్లీ దరఖాస్తులు తీసుకుంది.