గ్రేటర్ తిరుపతి విస్తరణకు వేగం
TPT: తిరుపతి కార్పొరేషన్ విస్తరణలో భాగంగా 63 గ్రామాలు గ్రేటర్‌లో విలీనం కానున్నాయి. తిరుపతి రూరల్ మొత్తం కార్పొరేషన్‌లో చేరుతుండగా, చంద్రగిరి మండలం నుంచి 13 గ్రామాలు కూడా ఇందులో భాగమవుతాయి. ఈ విలీనంతో నగర జనాభా 4.52 లక్షల నుంచి 7.86 లక్షలకు చేరనుంది. ఆదాయం రూ.149 కోట్ల నుంచి రూ.192.20 కోట్లకు పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.