నాలా నిర్మాణంపై ఆరా తీసిన ఎమ్మెల్యే

HYD: రామనస్తపుర పరిధిలో బహదూర్‌పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ గురువారం పర్యటించారు. ఖాజా ఫంక్షన్ హాల్ వద్ద కొనసాగుతున్న నాలా నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు కొనసాగే ప్రాంతాల్లో స్థానికులు సహకరించాలని కోరారు.