గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

AP: NTR జిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నాగలక్ష్మి(18) గుండెపోటుతో మృతిచెందింది. కళాశాల నుంచి బయటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే స్నేహితురాళ్లు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. నాగలక్ష్మి అకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.