సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

HYD: సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై దోబీఘాట్ చౌరస్తా, ఆర్టీసీ కాలనీ వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్ లో నిబంధనలు ఉల్లంఘించిన 33మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనల మేరకు వాహనాలను నడుపుతూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింహ నాయక్ కోరారు.