మట్టి గణపతులకు పర్యావరణ పరిరక్షణ: ఎస్పీ

NLG: మట్టి గణపతులతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవర్ అన్నారు. నల్లగొండ కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మట్టి గణపతులను పంపిణీ చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండుగను నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి శివరాంరెడ్డి పాల్గొన్నారు.