కామాక్షమ్మ సన్నిధిలో బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు

కామాక్షమ్మ సన్నిధిలో బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ తల్లి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17వ తేదీ నుండి జరగనున్నాయి. ఆదివారం బ్రహ్మోత్సవ సేవ కమిటీ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.