స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న బీర్ల ఐలయ్య

JN: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని జనగామ డీపీఆర్వో బండి పల్లవి తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, 9:50 గంటలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లా అభివృద్ధిపై ప్రసంగం ఉంటుందని పేర్కొన్నారు.