శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన యుగంధర్
W.G: ధర్మానికి, నీతికి, ఆదర్శ జీవనానికి ప్రతీక అయిన శ్రీ రామనవమి పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కుక్కునూరు మండల ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ శుభాకాంక్షలు తెలిపారు. రామ పారాయణం చేస్తూ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించే సంస్కృతి మనలో ఇమిడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అందరు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.