భార్యతో గొడవ.. బ్యాంకు ఉద్యోగి అదృశ్యం

HYD: ఇంట్లో గొడవపడిన బ్యాంకు ఉద్యోగి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. బండ్లగూడ ఇంద్రప్రస్థ కాలనీలోని కేత్రిశ్ ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్ బీ-బ్లాక్‌లో నివాసముండే బూర్ల విక్రమ్(30) బ్యాంక్ ఉద్యోగి. ఈ నెల3న భార్య శ్వేతతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆదివారం శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది.