VIDEO: వ్యాపార దుకాణాల్లో చోరీ

W.G: నరసాపురంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు చోరికి పాల్పడ్డారు. పట్టణంలోని ఒక ఎలక్ట్రానిక్ షాప్ డోర్లు పగలగొట్టి సుమారు రెండు లక్షల రూపాయల నగదును దొంగిలించారు. అలాగే షాపుల్లోని సీసీ కెమెరాల డేటా రికార్డ్‌లను ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నరసాపురం పట్టణ సీఐ యాదగిరి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.