VIDEO: దంచికొట్టిన భారీ వర్షం..

VIDEO: దంచికొట్టిన భారీ వర్షం..

SRD: కంగ్టి మండలంలోని సర్దార్ తండాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సమీపంలోని బోర్గి గ్రామంలో వర్షంతో పాటు వడగండ్లు కూడా పడినట్టు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండగా, పొడిగా ఉన్న వాతావరణం, తర్వాత ఒక్కసారిగా మారి మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ఈ రెండు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. గ్రామ శివార్లలో సాగు చేస్తున్న జొన్న పంటకు కొంత నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.