కరెంట్ షాక్‌తో మహిళ మృతి
KDP: మైలవరం మండలంలోని కర్మలవారిపల్లెలో మాధవరెడ్డి భార్య లక్ష్మీదేవి ఆదివారం సాయంత్రం కరెంటు షాక్‌తో మృతి చెందింది. ఇంటి వద్ద బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. 108 వాహనంలో జమ్మలమడుగు హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మరణించింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.