బీసీ బంద్‌కు మద్దతు తెలిపిన మాల మహానాడు
MHBD: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు జాతీయ మాల మహానాడు మద్దతు ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్, పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ ఎనమాల రాకేష్ మాల మహానాడు నాయకులతో కలిసి బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.