VIDEO: కడప జడ్పీ మీటింగుకు ఇద్దరే ఎమ్మెల్యేలు హాజరు
KDP: కడపలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ శనివారం గైర్హాజరయ్యారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాత్రమే హాజరయ్యారు. మొన్న నంద్యాలలో జరిగిన సాగునీటి పారుదల సలహా మండలి సమావేశానికి కూడా వరదరాజుల రెడ్డి ఒక్కరే హాజరయ్యారని సమాచారం.