పల్లె పోరు.. అభ్యర్థుల మధ్య ఘర్షణ
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ముల్కల కాలువలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, రెబల్ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.