చీడికాడ ఘటనపై స్పందించిన లోకేష్
AKP: చీడికాడ బీసీ బాలికల వసతి గృహంలో అక్రమాలు, ఆహార కొరతపై SMలో విద్యార్థులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. ఈ విషయం తన మనసును కలసివేసిందని, విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. దీనిని తన దృష్టికి తెచ్చినందుకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతూ, వారికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరారు.