విద్యుత్ నిర్లక్ష్యంతో లేగదూడ మృతి
JN:పాలకుర్తి మండలం చీమలబావి తండాలో ఆదివారం వేలాడుతున్న విద్యుత్ తీగ తగలడంతో ధరావత్ రెడ్యా నాయక్‌కు చెందిన లేగదూడ మృతి చెందింది. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తూ, ప్రమాదకర తీగలను తక్షణం సరిచేయాలని, దూడకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.