108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం
SKLM: మందస మండలం చిన్నకోష్ట గ్రామానికి చెందిన రష్మితకు పురిటినొప్పులు రావడంతో బంధువులు 108కు సమాచారం అందించారు. EMT ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్ వాయిలపల్లి మురళీ మోహన్ వెంటనే గ్రామానికి చేరుకుని రష్మితను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రసవ నొప్పులు తీవ్రమయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది తెలివిగా వ్యవహరించి, అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం చేసారు.