కలెక్టరేట్‌లో అంగన్వాడీ చిన్నారుల స్నాతకోత్సవం

కలెక్టరేట్‌లో అంగన్వాడీ చిన్నారుల స్నాతకోత్సవం

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లోని PGRS హాల్‌‌లో సోమవారం అంగన్వాడీ చిన్నారుల స్నాతకోత్సవం వేడుకగా జరిగింది. మహిళా శిశు సంక్షేమ, విద్యాశాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు ధ్రువీకరణ పత్రాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.