కౌలు రైతులకు రుణాలను అందించాలి

W.G: భీమవరం జిల్లా కలెక్టరేట్లో మంగళవారం బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలులో బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పథకాల లక్ష్యసాధనకు ప్రతి బ్యాంకు తమవంతు సహకారం అందించాలన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన కౌలు రైతులందరికీ రుణాల మంజూరుకు బ్యాంకర్లను ఆదేశించారు.