కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బంటుమిల్లి గ్రామంలో కాపు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం యొక్క విశిష్టతను, కార్తీక మాస ప్రాముఖ్యతను భావితరాలకు అందించేలా, ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు, నాయకులు పాల్గొన్నారు.