ప్రధాన రహదారిపై పారిశుద్ధ్య పనులు
NLG: ఆలేరు పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన దుమ్ము, మట్టిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. చైర్‌పర్సన్ బీజన బాలమణి కార్మికులకు మాస్కులు పంపిణీ చేసి పనులను పర్యవేక్షించారు. దీర్ఘకాలిక దుమ్ము సమస్య తీరడంతో వ్యాపారులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.