BREAKING: కృష్ణా నదిలో యువకుడు గల్లంతు
SRPT: జిల్లాలో మరో విషాదఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో విహారానికి వెళ్లి హుజూర్‌నగర్ మండలం లింగగిరికి చెందిన యువకుడు పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. అప్రమత్తమైన తోటి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.